అక్షయ తృతీయ రోజున మంచినీటి దానం!
శ్రీమహా విష్ణువుకి ప్రీతికరమైన మాసాలలో వైశాఖ మాసం ఒకటి. ఈ మాసంలో శుద్ధ తదియ 'అక్షయ తృతీయ'గా చెప్పబడుతోంది. 'అక్షయ తృతీయ' రోజున ఏది ఇంటికి వచ్చినా అది అక్షయంగా పెరుగుతుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. అందువల్లనే ఈ రోజున చాలామంది ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ రోజున బంగారం కొనుగోలు చేయడం వలన, అది అక్షయంగా పెరిగిపోతుందని భావిస్తుంటారు.

కానీ ఈ రోజున వీలైనంత వరకూ దానధర్మాలు చేయాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మంచి నీటిని దానం చేయాలని అంటున్నాయి. అలాగే శనగలు .. గోధుమలు వంటి ఆహార ధాన్యాలను దానంగా ఇవ్వాలని చెబుతున్నాయి. ఈ విధంగా చేయడం వలన .. ఈ జన్మలోనే కాదు .. వచ్చే జన్మలోను మంచినీటికి .. ఆహారానికి ఎలాంటి కొరత ఉండదట. రానున్న జన్మలు ఎలాంటివైనా .. మంచి నీటి కోసం .. ఆహారం కోసం వెతుక్కోవలసిన అవసరం రాదని స్పష్టం చేస్తున్నాయి. అందువలన అక్షయ తృతీయ రోజున మంచినీటిని .. ఆహార ధాన్యాలను దానం చేయడం మరిచిపోకూడదు.            
Copyright © 2017; www.ap7am.com