పాపాలను హరింపజేసే ఏకాదశి
తెలిసో .. తెలియకో పాపాలు చేయడం జరుగుతూ వుంటుంది. అలాంటి పాపాల ఫలితాలు జన్మజన్మల పాటు వెంటాడుతూనే ఉంటాయి. ఈ కారణంగా బాధలు .. కష్టాలు .. ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటివాటి బారి నుంచి బయటపడటానికి అంతా తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే వుంటారు.

అలా పాపాల నుంచి విముక్తిని పొందాలనుకునే వారు ఆచరించవలసినదే పాపవిమోచన ఏకాదశి వ్రతమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. చైత్ర బహుళ ఏకాదశికే 'పాపవిమోచన ఏకాదశి' అని పేరు. ఈ రోజున ఉపవాస .. జాగరణ నియమాలను పాటిస్తూ శ్రీ మహా విష్ణువును పూజించవలసి ఉంటుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన పాపాలన్నీ పటాపంచలవుతాయనీ .. పుణ్యఫలాలు లభిస్తాయనేది మహర్షుల మాట.     
Copyright © 2017; www.ap7am.com