ఉగాది రోజున ఆవునెయ్యితో దీపారాధన
చైత్రశుద్ధ పాడ్యమిని 'ఉగాది'గా జరుపుతుంటారు. యుగానికి ఆదిగా .. ప్రారంభ సమయంగా 'ఉగాది'ని వ్యవహరిస్తుంటారు. ఈ రోజు ఉదయాన్నే ఇంటిని .. పూజా మందిరాన్ని శుభ్రం చేసి .. అలంకరించాలి. గడపకి పసుపు రాసి .. కుంకుమ బొట్లు పెట్టి .. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. సంప్రదాయ బద్ధమైన కొత్త వస్త్రాలను ధరించి .. పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరించాలి. రెండు కుందులలో ఐదేసి వత్తుల చొప్పున వుంచి ... ఆవు నెయ్యితో దీపారాధన చేయవలసి ఉంటుంది.

 ఇష్టదైవాన్ని పూజించి .. ఆరు రుచులతో సిద్ధం చేసిన 'ఉగాది' పచ్చడిని నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. అలాగే వివిధరకాల పండ్లను .. పిండి వంటలను నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ రోజు సాయంత్రం దగ్గరలోని ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలి. అక్కడ జరిగే పంచాంగ శ్రవణం వినడం వలన, దోషాలు తొలగిపోయి .. శుభాలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.        
Copyright © 2017; www.ap7am.com