అలాంటి చోటునే లక్ష్మీదేవి వుంటుంది
ఒకసారి దేవేంద్రుడు లక్ష్మీదేవి దర్శనం చేసుకుంటాడు. ఎలాంటివారి పట్ల ఆ తల్లి అనుగ్రహం వుంటుందో సెలవీయమని కోరతాడు. ఎవరైతే దేవతలను పూజిస్తారో .. తల్లిదండ్రులను ప్రేమిస్తారో .. గురువులను సేవిస్తారో అలాంటి వారిపట్ల తన అనుగ్రహం వుంటుందని లక్ష్మీదేవి చెబుతుంది.

 నిస్సహాయుల పట్ల ఎవరైతే మానవత్వం చూపుతారో .. అలాంటివారికి దాన ధర్మాలు చేస్తారో వారిపై తన దృష్టి ఎప్పుడూ వుంటుందని అంటుంది. మూగ జీవాల పట్ల ఎవరైతే కనికరం చూపుతారో .. వాటి పోషణకి తమవంతు కృషి చేస్తారో అలాంటివారిని తాను సదా కనిపెట్టుకుని ఉంటానని చెబుతుంది. నిత్యం రెండు పూటలా దీపారాధన జరిపే ఇళ్లలోను .. పగటివేళ నిద్రించని వారి ఇళ్లలోను .. స్త్రీలు కన్నీళ్లు పెట్టని ఇళ్లలోను తాను ఉంటానని అంటుంది. ఈ విధంగా వ్యవహరించినట్టైతే లక్ష్మీదేవి ప్రీతిచెంది, ఆ ఇంట సిరిసంపదలు కురిపిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.        
Copyright © 2017; www.ap7am.com