సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన ఫలితం
సుబ్రహ్మణ్యస్వామి కొన్ని క్షేత్రాలలో ప్రధాన దైవంగాను .. మరికొన్ని క్షేత్రాలలో ఉపాలయాలలోను దర్శనమిస్తూ ఉంటాడు. ఆ స్వామి ఎక్కడ ఎలా కొలువైనా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ వుంటారు. కొన్ని క్షేత్రాలలో సర్ప రూపంలోనూ .. మరి కొన్ని క్షేత్రాలలో బల్లెం ధరించిన బాలుడి రూపంలో సుబ్రహ్మణ్య స్వామి పూజలు అందుకుంటూ వుంటాడు.

 మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు కనుక, ఆ రోజున స్వామిని దర్శించుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ రోజున స్వామికి అరటిపండ్లు .. పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించడం వలన ఆయన ప్రీతి చెందుతాడు. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం వలన .. అంకితభావంతో అర్చించడం వలన సర్పసంబంధమైన దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సంతానం లేనివారు స్వామిని నియమ నిష్ఠలతో పూజించడం వలన, సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.    
Copyright © 2017; www.ap7am.com