ఇత్తడి శివలింగ ఆరాధన ఫలితం
పరమశివుడి లీలావిశేషాలను తలచుకుంటేనే జన్మ ధన్యమవుతుంది. కోరిన వరాలను ప్రసాదించే కొంగుబంగారం ఆయన. అందుకే ఆ స్వామి ఆలయాలు భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి. నిత్యం శివాలయానికి వెళ్లే భక్తులు కొందరైతే, పూజా మందిరంలోని శివలింగానికి అనునిత్యం అభిషేకం చేసే వాళ్లు మరికొందరు. ఏ శివలింగానికి పూజ చేసినా విశేషమైన పుణ్య ఫలమే దక్కుతుంది. అయితే మనసులోని ధర్మబద్ధమైన కోరికలను బట్టి ఆయా శివలింగాలను అర్చించవలసి ఉంటుంది.

 లోహాలతో చేయబడిన శివలింగాల విషయానికి వస్తే, బంగారం .. వెండి .. రాగి .. ఇత్తడితో చేయబడిన శివలింగాలలో ఒక్కో శివలింగాన్ని పూజించడం వలన ఒక్కో ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలా 'ఇత్తడి శివలింగం'ను పూజించడం వలన, సకల శుభాలు కలుగుతాయని స్పష్టం చేస్తున్నాయి. వాయు దేవుడు అనునిత్యం ఇత్తడి శివలింగాన్ని పూజిస్తాడని ఆధ్యాత్మిక గ్రంధాలు తెలియపరుస్తున్నాయి.   
Copyright © 2017; www.ap7am.com