కల్కి అవతారం
లోకంలో దుర్మార్గం పెరిగిపోతున్నప్పుడు ... అధర్మం విస్తరిస్తున్నప్పుడు ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు అనేక అవతారాలు ధరిస్తూ వచ్చాడు. ఈ సృష్టిలో తొలిసారిగా జీవరాసి సముద్రంలో ఆవిర్భవించింది అనడానికి సంకేతంగా మత్స్య ... కూర్మావతారాలు, ఆ జీవరాసులు పశుపక్ష్యాదులుగా పరిణతి చెందాయనడానికి గుర్తుగా వరాహావతారం ధరించాడు.

మృగ రూపం నుంచి మానవ రూపం ఏర్పడుతుందనడానికి సంకేతంగా నృసింహ అవతారం ... మానవుడి తొలిదశను గుర్తుచేసే మరుగుజ్జు రూపంలో వామన అవతారాన్ని ధరించి లోక కల్యాణానికి కారకుడయ్యాడు. రాముడిగా ధర్మాన్ని ఆచరించి చూపిన శ్రీ మహా విష్ణువు ... ధర్మానికి అండగా నిలబడాలని కృష్ణావతారంలో చెప్పాడు. బుద్ధావతారంలో మానవులకు ధర్మ మార్గాన్ని ఉపదేశిస్తూనే, రాక్షస ప్రవృత్తి కలిగిన వారికి అహింసా మార్గాన్ని సూచించాడు.

ఇలా భగవంతుడు ధరించిన ప్రతి అవతారం వెనుక ఓ అర్థం ... పరమార్థం దాగి వున్నాయి. అయితే కలియుగంలో పాపభారం అంతకంతకు పెరిగిపోతుందనీ, ఆ సమయంలో తాను 'కల్కి' గా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని శ్రీ మహా విష్ణువు చెప్పినట్టుగా పురాణాలలో కనిపిస్తుంది.
Sun, Jun 30, 2013, 10:35 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View