శ్రీ వైష్ణవీ దేవి
శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు జ్యోతి రూపంలో వెలసిన ఏకైక శక్తి పీఠం 'శ్రీ వైష్ణవీ దేవి' ఆలయం. జమ్మూ కాశ్మీర్ సమీపంలోగల వైష్ణోదేవి ఆలయం ... ఇదీ ఒకటేనని కొందరు భావిస్తుంటారు. కానీ ఇది పంజాబ్ - పఠాన్ కోట్ నుంచి జోగేంద్రనగర్ వెళ్లే దారిలో హిమాచల ప్రదేశ్ పరిధిలో దర్శనమిస్తుంది. భక్తుల సందేహాన్ని తీర్చడం కోసమే ఇక్కడి అమ్మవారిని జ్వాలా వైష్ణవీదేవి అని పిలుస్తుంటారు.

సతీదేవి 'నాలుక' ఇక్కడ నిలువుగా పడిందనీ, ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఇక్కడ జ్వాల ఎగసి పడుతూనే వుందని చెబుతుంటారు. ఇక్కడి అమ్మవారు లక్ష్మీ ... సరస్వతి ... కాళీ రూపాల్లో త్రిశక్తి స్వరూపిణిగా భక్తులకు కనువిందు చేస్తుంటుంది.

త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా లంకకు బయలుదేరేముందు ఇక్కడి అమ్మవారిని పూజించి ఆమె ఆశీస్సులు పొందాడట. మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడి సలహా మేరకు అర్జునుడు ఈ అమ్మవారిని దర్శించుకుని ఆమె అనుగ్రహాన్ని పొందినట్టు స్థల పురాణం చెబుతోంది.
Tue, Jun 18, 2013, 05:51 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View