వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం

14-05-2020 Thu 11:37

శ్రీకృష్ణుడిని ఎంతో మంది మహర్షులు ఆరాధించారు .. ఆ స్వామి సేవలో తరించారు. తన నామస్మరణలో .. తన కీర్తనల్లో తేలియాడే మహర్షులను స్వామి అనుగ్రహిస్తూ వచ్చాడు. అలా శ్రీకృష్ణుడు .. వశిష్ఠ మహర్షికి ప్రత్యక్షమైన క్షేత్రంగా 'తిరుక్కణ్ణం గుడి' కనిపిస్తుంది. ఈ క్షేత్రాన్నే 'కృష్ణారణ్య క్షేత్రం' అని కూడా పిలుస్తుంటారు.

తమిళనాడు .. నాగపట్నం సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ వశిష్ఠమహర్షి వెన్నతో శ్రీకృష్ణుడి ప్రతిమను చేసి ఆరాధించగా, ఆ స్వామి ప్రత్యక్షమయ్యాడట. వశిష్ట మహర్షిని ఆలింగనం చేసుకుని తన అనుగ్రహ వర్షాన్ని కురింపించాడు. ఇక్కడ రాత్రివేళ ఆకులు ముడుచుకునే 'చింతచెట్టు' .. పువ్వులు మాత్రమే తప్ప కాయలు కాయని 'పొగడ చెట్టు' కనిపిస్తాయి. తిరుమంగై ఆళ్వార్ కీర్తించిన ఈ క్షేత్రంలో  స్వామివారు ప్రత్యక్షంగా కొలువై వున్నాడనడానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక భక్తుల అనుభవాలు ఇక్కడ  కథలు కథలుగా వినిపిస్తూ ఉంటాయి.


More Bhakti Articles
కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
2 years ago
వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం
2 years ago
అప్సరసలు .. పేర్లు
2 years ago
మోహనపురంగా పిలవబడే తిరుమోగూర్
2 years ago
వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ
2 years ago
కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే
2 years ago
మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం
2 years ago
దొంగలపై విషాన్ని వెదజల్లిన ఆదిశేషుడు
2 years ago
నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం
2 years ago
ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే
2 years ago
ద్వార లక్ష్మీ పూజా ఫలితం
2 years ago
చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు
2 years ago
పూరి క్షేత్రం ప్రత్యేకతలు
2 years ago
వ్యాధులను నివారించే విమలాదిత్యుడు
2 years ago
దైవానికి ఇలా నమస్కరించాలి
2 years ago
..more