వైశాఖ మాసంలో మామిడి పండ్ల దానం

25-04-2020 Sat 16:05

ఆధ్యాత్మిక పరంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న తెలుగు మాసాలలో వైశాఖ మాసం ఒకటిగా కనిపిస్తుంది. వైశాఖ మాసాన్ని మాధవ మాసమని అంటారు. ఈ మాసంలో లక్ష్మీనారాయణులను ఆరాధించడం వలన అనేక పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో శ్రీమహా విష్ణువుకు 'తులసి'ని సమర్పించడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ మాసంలో రావిచెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయడం .. అనునిత్యం విష్ణు సహస్రనామాన్ని పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయి.

ఈ మాసంలో చేసే దానాలు అనేక రెట్ల ఫలితాలను అందిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. వైశాఖ మాసంలో ఎండలు మండిపోతుంటాయి కనుక, ఈ మాసంలో మంచినీరు .. మజ్జిగ .. నిమ్మకాయ నీళ్లు .. చెరుకు రసం దానం చేయడం వలన పుణ్యరాశి పెరుగుతుంది. ఇక ఈ మాసంలో 'మామిడి పండ్లు' విరివిగా లభిస్తాయి. అందువలన బ్రాహ్మణులకు మామిడి పండ్లను దానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన, సమస్త పాపాలు నశిస్తాయనేది మహర్షుల మాట.    


More Bhakti Articles
కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
2 years ago
వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం
2 years ago
అప్సరసలు .. పేర్లు
2 years ago
మోహనపురంగా పిలవబడే తిరుమోగూర్
2 years ago
వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ
2 years ago
కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే
2 years ago
మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం
2 years ago
దొంగలపై విషాన్ని వెదజల్లిన ఆదిశేషుడు
2 years ago
నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం
2 years ago
ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే
2 years ago
ద్వార లక్ష్మీ పూజా ఫలితం
2 years ago
చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు
2 years ago
పూరి క్షేత్రం ప్రత్యేకతలు
2 years ago
వ్యాధులను నివారించే విమలాదిత్యుడు
2 years ago
దైవానికి ఇలా నమస్కరించాలి
2 years ago
..more