అల్లపర్రు దేవుడి చెరువు

20-04-2020 Mon 16:16

శ్రీ భూ నీళా సమేత చెన్నకేశవస్వామి ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో 'అల్లపర్రు' ఒకటిగా కనిపిస్తుంది. 'అల్లపర్రు' గ్రామస్తులు మంచినీటి కోసం చెరువు తవ్వుతుండగా, శ్రీ చెన్నకేశవమూర్తి శిలా ప్రతిమ బయటపడిందట. ఆ మూర్తిని చెరువు కట్టపై ఉంచి పూజించడం మొదలుపెట్టారట. అయితే ఆ పక్కనేగల 'ఉల్లిపాలెం'  గ్రామానికి చెందిన జమీందారుకు కలలో స్వామి కనిపించి, 'ఉల్లిపాలెం'లో తనకి ఆలయం నిర్మించి నిత్య పూజలు జరిగేలా చూడమని ఆదేశించాడట.

సాధారణమైన కల అనుకుని ఆ జమీందారు పట్టించుకోకపోవడంతో, మళ్లీ  కలలో స్వామి కనిపించి అంతకు ముందులానే సెలవిచ్చాడట. దాంతో 'అల్లపర్రు' గ్రామస్తులకు విషయం చెప్పి, ఆ మూర్తిని తీసుకొచ్చి 'ఉల్లిపాలెం' ఆలయంలో ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం చెబుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఇప్పటికీ అల్లపర్రుకి ఊరేగింపుగా వచ్చి కాసేపు కొలువు చేసి వెళుతుంటాడు. ఇక్కడి స్వామివారు మహిమాన్వితుడని ఇరుగ్రామాల ప్రజలు భావిస్తుంటారు. స్వామివారి దర్శన మాత్రం చేతనే ఆపదలు తొలగిపోతాయని, విజయాలు చేకూరతాయని విశ్వసిస్తుంటారు. ఇప్పటికీ స్వామివారి మూర్తి బయటపడిన 'అల్లపర్రు' చెరువు .. 'దేవుడి చెరువు'గానే పిలవబడుతుండటం విశేషం.      


More Bhakti Articles
కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
2 years ago
వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం
2 years ago
అప్సరసలు .. పేర్లు
2 years ago
మోహనపురంగా పిలవబడే తిరుమోగూర్
2 years ago
వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ
2 years ago
కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే
2 years ago
మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం
2 years ago
దొంగలపై విషాన్ని వెదజల్లిన ఆదిశేషుడు
2 years ago
నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం
2 years ago
ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే
2 years ago
ద్వార లక్ష్మీ పూజా ఫలితం
2 years ago
చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు
2 years ago
పూరి క్షేత్రం ప్రత్యేకతలు
2 years ago
వ్యాధులను నివారించే విమలాదిత్యుడు
2 years ago
దైవానికి ఇలా నమస్కరించాలి
2 years ago
..more