కొండగా పెరుగుతూ పోయిన పుట్ట

12-03-2020 Thu 17:48

సాధారణంగా పుట్టలు ఒక స్థాయి ఎత్తువరకు మాత్రమే పెరుగుతాయి. కానీ ప్రకాశం జిల్లా .. పెద్దారవీడు మండలం .. రాజంపల్లి గ్రామ సమీపంలో కొండగా పెరిగిన పుట్టను చూడవచ్చు. ఆ కొండపై వెలసిన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవచ్చు .. ఆ స్వామి అనుగ్రహాన్ని అందుకోవచ్చు. పూర్వం ఈ ప్రదేశంలో ఒక పుట్ట ఉండేదట. కాలక్రమంలో ఆ పుట్ట ..  కొండగా పెరుగుతూ పోయిందని స్థానికులు చెబుతారు.

రాజమ్మ అనే ఒక భక్తురాలిని అనుగ్రహించడం కోసమే వేంకటేశ్వరస్వామివారు ఇక్కడ ఆవిర్భవించాడని అంటారు. ఆ రాజమ్మ పేరు మీదనే ఈ గ్రామానికి 'రాజంపల్లి' అనే పేరు వచ్చిందని చెబుతారు. గొడ్రాలుగా అనేక అవమానాలు ఎదుర్కున్న రాజమ్మ, స్వామి కరుణచేత సంతాన భాగ్యాన్నిపొందింది. అందువల్లనే ఈ కొండను 'గొడ్రాలికొండ' అని పిలుస్తారు. కొండ దిగువన రాజ్యలక్ష్మీ సమేతుడైన వేంకటేశ్వర స్వామి దర్శనమిస్తుంటాడు. ఈ మూర్తిని 'ముచికుంద మహర్షి' ప్రతిష్ఠించినట్టు చెబుతారు. సంతానం విషయంలో ఆలస్యమవుతున్నవారు, ఇక్కడి స్వామిని దర్శించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందుతుంటారు.


More Bhakti Articles
కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
2 years ago
వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం
2 years ago
అప్సరసలు .. పేర్లు
2 years ago
మోహనపురంగా పిలవబడే తిరుమోగూర్
2 years ago
వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ
2 years ago
కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే
2 years ago
మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం
2 years ago
దొంగలపై విషాన్ని వెదజల్లిన ఆదిశేషుడు
2 years ago
నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం
2 years ago
ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే
2 years ago
ద్వార లక్ష్మీ పూజా ఫలితం
2 years ago
చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు
2 years ago
పూరి క్షేత్రం ప్రత్యేకతలు
2 years ago
వ్యాధులను నివారించే విమలాదిత్యుడు
2 years ago
దైవానికి ఇలా నమస్కరించాలి
2 years ago
..more