తమ్మర సీతారామాలయం

10-03-2020 Tue 17:18

శ్రీరామచంద్రుడు వెలసిన ప్రాచీన క్షేత్రాల్లో 'తమ్మర' ఒకటిగా కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ హనుమంతుడి ఆలయం మాత్రమే ఉండేదట. ఆ తరువాత చాలా కాలానికి ఊళ్లో వాళ్లంతా కలిసి, హనుమంతుడి ఎదురుగా రామాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఆ ఊరిలో ఒక బాలుడి ద్వారా దైవం తన వాక్కును వినిపించింది. హనుమంతుడి ఆలయానికి సమీపంలోగల పుట్టలోనే సీతారాముల మూర్తి ఉందనీ, ఆ మూర్తిని వెకిలికి తీసి ప్రతిష్ఠ చేయమని పలికిందట. దాంతో గ్రామస్థులు పవిత్రులై ఆ పుట్ట దగ్గరికి వెళ్లి చూడగా, లోపల స్వామివారి మూర్తి కనిపించింది. దాంతో అక్కడ ఆలయాన్ని నిర్మించి ఆ మూర్తిని ప్రతిష్ఠించారు. భద్రాచలంలో మాదిరిగానే ఇక్కడ కూడా స్వామివారి తొడపై సీతమ్మవారు కూర్చుని ఉండటం విశేషం. శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు.


More Bhakti Articles
కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
2 years ago
వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం
2 years ago
అప్సరసలు .. పేర్లు
2 years ago
మోహనపురంగా పిలవబడే తిరుమోగూర్
2 years ago
వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ
2 years ago
కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే
2 years ago
మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం
2 years ago
దొంగలపై విషాన్ని వెదజల్లిన ఆదిశేషుడు
2 years ago
నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం
2 years ago
ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే
2 years ago
ద్వార లక్ష్మీ పూజా ఫలితం
2 years ago
చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు
2 years ago
పూరి క్షేత్రం ప్రత్యేకతలు
2 years ago
వ్యాధులను నివారించే విమలాదిత్యుడు
2 years ago
దైవానికి ఇలా నమస్కరించాలి
2 years ago
..more