దక్షారామంలో శివుడిని ప్రధమంగా అర్చించిన సూర్యుడు

24-01-2020 Fri 16:55

పరమశివుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన ప్రాచీన క్షేత్రాలలో 'దక్షారామం' ఒకటి. ఇక్కడి స్వామివారు భీమేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఇక్కడి శివుడిని తొలిసారిగా సూర్యభగవానుడు పూజించాడు. కృతయుగంలో తారకాసురుడిని కుమారస్వామి సంహరించినప్పుడు, ఆ అసురుడి కంఠంలోని 'అమృత లింగం' అయిదు భాగాలై ఐదు ప్రదేశాల్లో పడిపోయాయి. వాటిలోఒక భాగం 'దక్షారామం'లో పడింది.

ఆ శకలాన్ని పవిత్ర గోదావరి జలాలతో సంప్రోక్షణ చేసి ప్రతిష్ఠించాలని సప్త రుషులు కోరగా, గోదావరి నది అయిదు పాయలుగా విడిపోయి సప్త ఋషుల వెంట బయల్దేరింది. గోదావరి ఉధృతికి కొంతమంది రాక్షసుల నివాసాలు దెబ్బతినడంతో, సప్త గోదావరులు ఆవిరైపోవాలని వాళ్లు శపించారు. ఈ విషయంలో అసురులకు .. మహర్షులకు మధ్య వాదన జరిగింది. చివరికి 'తుల్యభాగుడు' అనే తాపసుడు మధ్యవర్తిగా వ్యవహరించి, సప్త రుషుల వెంట గోదావరి 'అంతర్వాహిని'గా ప్రవహించేలా చేశాడు. ఈ కారణంగా దక్షారామానికి సప్తరుషులు ఆలస్యంగా చేరుకున్నారు. అప్పటికే  పరమశివుడు అక్కడ ప్రతిష్ఠితుడయ్యాడు. సూర్యభగవానుడు ఆయనకి ప్రథమార్చన చేశాడు.    


More Bhakti Articles
కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
2 years ago
వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం
2 years ago
అప్సరసలు .. పేర్లు
2 years ago
మోహనపురంగా పిలవబడే తిరుమోగూర్
2 years ago
వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ
2 years ago
కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే
2 years ago
మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం
2 years ago
దొంగలపై విషాన్ని వెదజల్లిన ఆదిశేషుడు
2 years ago
నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం
2 years ago
ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే
2 years ago
ద్వార లక్ష్మీ పూజా ఫలితం
2 years ago
చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు
2 years ago
పూరి క్షేత్రం ప్రత్యేకతలు
2 years ago
వ్యాధులను నివారించే విమలాదిత్యుడు
2 years ago
దైవానికి ఇలా నమస్కరించాలి
2 years ago
..more