విశేషాల సమాహారం వాడపల్లి

17-01-2020 Fri 17:30

శివ కేశవులు కొలువైన క్షేత్రాలు మరింత మహిమాన్వితమైనవిగా భక్తులు భావిస్తుంటారు. అలా శివకేశవులు వెలసిన పరమ పవిత్రమైన క్షేత్రంగా 'వాడపల్లి' దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఈ క్షేత్రం అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తుంది. ఈ క్షేత్రం కృష్ణానది .. మూసినది సంగమ స్థానం. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి .. శివలింగం రెండూ అగస్త్యుడు ప్రతిష్ఠించాడు.

లక్ష్మీనరసింహస్వామి మూర్తి 'నాసిక'కి ఎదురుగా గల దీపం స్వామివారి శ్వాస ప్రక్రియకి తగినట్టుగా రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ పక్కనే గల మరో దీపం మాత్రం నిశ్చలంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా వున్నారని చెబుతారు. ఇక ఇక్కడి శివలింగం తల పైభాగంలో నిరంతరం నీరు ఊరుతుంటుంది. శివలింగం తలపై భాగంలోని రంధ్రము ఎంతవరకూ వుందో తెలుసుకోవడానికి ప్రయత్నించిన ఆది శంకరులవారు, అది స్వామివారి మహిమగా తేల్చడం మరో విశేషం. కార్తీకమాసంలో ఇక్కడి నదీ సంగమ స్థానంలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు.


More Bhakti Articles
కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
1 year ago
వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం
1 year ago
అప్సరసలు .. పేర్లు
1 year ago
మోహనపురంగా పిలవబడే తిరుమోగూర్
1 year ago
వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ
1 year ago
కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే
1 year ago
మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం
1 year ago
దొంగలపై విషాన్ని వెదజల్లిన ఆదిశేషుడు
1 year ago
నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం
1 year ago
ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే
1 year ago
ద్వార లక్ష్మీ పూజా ఫలితం
1 year ago
చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు
1 year ago
పూరి క్షేత్రం ప్రత్యేకతలు
1 year ago
వ్యాధులను నివారించే విమలాదిత్యుడు
1 year ago
దైవానికి ఇలా నమస్కరించాలి
1 year ago
..more