ప్రత్యక్ష దర్శనమిచ్చే సుబ్రహ్మణ్యేశ్వరుడు

13-01-2020 Mon 18:08

సుబ్రహ్మణ్యస్వామి కొలువైన మహిమాన్వితమైన క్షేత్రాల్లో 'నడిపూడి' ఒకటి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఈ ప్రదేశానికి వచ్చి వెలిశాడని స్థలపురాణం చెబుతోంది. స్వామివారి గర్భాలయం లోపల వైపున ద్వారం పైభాగంలో 'పుట్ట' వుంది. ఈ పుట్టలో ఇప్పటికీ సర్పం ఉంటుంది.

ఈ సర్పం రాత్రివేళలో ఆ పుట్టలోకి ప్రవేశిస్తుంది .. ఉదయాన్నే బయటికి వెళ్లిపోతుంది. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చాలామంది వున్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై వున్నాడని స్థానికులు నమ్ముతుంటారు. సర్ప సంబంధమైన దోషాలతో బాధలుపడేవారు ఈ క్షేత్ర దర్శనం చేయడం వలన, ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాల్లో ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.


More Bhakti Articles
కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
2 years ago
వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం
2 years ago
అప్సరసలు .. పేర్లు
2 years ago
మోహనపురంగా పిలవబడే తిరుమోగూర్
2 years ago
వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ
2 years ago
కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే
2 years ago
మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం
2 years ago
దొంగలపై విషాన్ని వెదజల్లిన ఆదిశేషుడు
2 years ago
నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం
2 years ago
ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే
2 years ago
ద్వార లక్ష్మీ పూజా ఫలితం
2 years ago
చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు
2 years ago
పూరి క్షేత్రం ప్రత్యేకతలు
2 years ago
వ్యాధులను నివారించే విమలాదిత్యుడు
2 years ago
దైవానికి ఇలా నమస్కరించాలి
2 years ago
..more