కన్నీళ్లు పెట్టుకున్న సీతమ్మవారు

31-12-2019 Tue 18:15

సీతారామచంద్రస్వామి కొలువైన ప్రాచీన క్షేత్రాలలో 'తమ్మర' ఒకటి. సూర్యాపేట జిల్లా .. కోదాడ మండలం పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. స్వప్నంలో స్వామివారు కనిపించి చెప్పడం వలన, కొంతమంది భక్తులు పూనుకుని ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో సీతారామలక్ష్మణుల ప్రతిష్ఠ జరిగిన తరువాత, పూజలు మొదలయ్యాయి. స్వామివారు అప్పగించిన పనులను పూర్తి చేశామనే సంతృప్తితో భక్తులు నిద్రించారట.

అప్పుడు ఒక భక్తుడి కలలో సీతాదేవి కనిపించిందట. 'అమ్మా ఎందుకు ఆ కన్నీళ్లు?' అని ఆయన అడిగితే, స్వామివారి సేవకి అవసరమైన నీళ్లను దూరం నుంచి తెచ్చుకోలేకపోతున్నాని అమ్మవారు చెప్పిందట. అంతే ఆ భక్తుడు మరునాడు ఉదయమే ఆలయానికి చేరుకుని, జరిగిందంతా మిగతావారికి చెప్పాడు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో పెద్ద బావిని తవ్వించాడు. ఈ బావిలో నీరు తియ్యగా ఉంటుంది .. ఇంతవరకూ ఈ బావిలో నీరు ఎండిపోకపోవడం విశేషం.


More Bhakti Articles
కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
2 years ago
వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం
2 years ago
అప్సరసలు .. పేర్లు
2 years ago
మోహనపురంగా పిలవబడే తిరుమోగూర్
2 years ago
వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ
2 years ago
కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే
2 years ago
మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం
2 years ago
దొంగలపై విషాన్ని వెదజల్లిన ఆదిశేషుడు
2 years ago
నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం
2 years ago
ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే
2 years ago
ద్వార లక్ష్మీ పూజా ఫలితం
2 years ago
చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు
2 years ago
పూరి క్షేత్రం ప్రత్యేకతలు
2 years ago
వ్యాధులను నివారించే విమలాదిత్యుడు
2 years ago
దైవానికి ఇలా నమస్కరించాలి
2 years ago
..more