'వెన్నవరం' కోనేరు మహిమ ఇదే

30-12-2019 Mon 17:56

వేంకటేశ్వరస్వామి ఆవిర్భవించిన పరమ పవిత్రమైన పుణ్య క్షేత్రాలలో 'వెన్నవరం' ఒకటిగా కనిపిస్తుంది. మహబూబా బాద్ జిల్లా .. డోర్నకల్ మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడ స్వామివారు వెలసిన కొండ 'వెన్నముద్ద' ఆకారంలో ఉండటం వలన, ఈ గ్రామానికి 'వెన్నవరం' అనే పేరు వచ్చిందని అంటారు. స్వామివారు ఆవిర్భవించిన సమయంలోనే ఈ కొండ రెండుగా చీలిపోయి 'కోనేరు' ఏర్పడిందని అంటారు. ఇది చాలా లోతైన కోనేరు అని చెబుతారు.

ఈ కోనేటి నీటిని తమ పొలం అవసరాలకి .. ఇంటి అవసరాలకి వాడుకోవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ విఫలమయ్యారు. ఇది స్వామివారి మహిమగానే భావించిన గ్రామస్థులు ఈ కోనేటి నీటిని తమ సొంత వసరాలకి ఎలాంటి పరిస్థితుల్లోను ఉపయోగించరు. స్వామివారి కైంకర్యాలకు అర్చకులు మాత్రమే ఈ కోనేటి నీటిని ఉపయోగిస్తుంటారు. మహిమాన్వితమైన ఈ కోనేరు నీటిని తలపై చల్లుకోవడం వలన సమస్త పాపాలు నశిస్తాయనేది భక్తుల విశ్వాసం.                


More Bhakti Articles
కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
1 year ago
వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం
1 year ago
అప్సరసలు .. పేర్లు
1 year ago
మోహనపురంగా పిలవబడే తిరుమోగూర్
1 year ago
వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ
1 year ago
కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే
1 year ago
మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం
1 year ago
దొంగలపై విషాన్ని వెదజల్లిన ఆదిశేషుడు
1 year ago
నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం
1 year ago
ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే
1 year ago
ద్వార లక్ష్మీ పూజా ఫలితం
1 year ago
చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు
1 year ago
పూరి క్షేత్రం ప్రత్యేకతలు
1 year ago
వ్యాధులను నివారించే విమలాదిత్యుడు
1 year ago
దైవానికి ఇలా నమస్కరించాలి
1 year ago
..more