హనుమ అనుగ్రహం ఇలా లభిస్తుంది

29-05-2019 Wed 18:05

రామాలయం లేని గ్రామం దాదాపు కనిపించదు. అలాగే హనుమంతుడు లేని రామాలయమూ కనిపించదు. ఎక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడనీ, హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవాలనుకునేవారు ముందుగా రామచంద్రుడి భక్తులై వుండాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. తనని పూజిస్తే మురిసిపోయే హనుమంతుడు .. రామచంద్రుడిని కీర్తిస్తే పరవశించి పోతాడు. అందుకే రాముడితో కలిపి హనుమంతుడిని సేవించడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని అంటారు.

హనుమంతుడికి మంగళవారం .. శనివారం అంటే ఎంతో ఇష్టం. అందువలన ఆ రోజుల్లో ఆయనకి ప్రదక్షిణలు చేయాలి. సిందూర అభిషేకం .. ఆకుపూజ చేయించాలి. వడలు .. తీపి అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. 'హనుమజ్జయంతి' రోజున ఇలా చేయడం మరింత విశేషమైనదనేది మహర్షుల మాట. ఈ రోజున 'సుందరకాండ' పారాయణం .. 'హనుమాన్ చాలీసా' చదువుకోవడం .. నామ సంకీర్తనం చేయడం వలన, హనుమంతుడు ప్రీతి చెందుతాడు. ఆయురారోగ్యాలు .. సిరి సంపదలను అనుగ్రహిస్తాడు.


More Bhakti Articles
కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
2 years ago
వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం
2 years ago
అప్సరసలు .. పేర్లు
2 years ago
మోహనపురంగా పిలవబడే తిరుమోగూర్
2 years ago
వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ
2 years ago
కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే
2 years ago
మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం
2 years ago
దొంగలపై విషాన్ని వెదజల్లిన ఆదిశేషుడు
2 years ago
నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం
2 years ago
ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే
2 years ago
ద్వార లక్ష్మీ పూజా ఫలితం
2 years ago
చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు
2 years ago
పూరి క్షేత్రం ప్రత్యేకతలు
2 years ago
వ్యాధులను నివారించే విమలాదిత్యుడు
2 years ago
దైవానికి ఇలా నమస్కరించాలి
2 years ago
..more