కోరికలను నెరవేర్చు రుద్రాక్ష !

09-03-2015 Mon 15:53

విశేషమైన పర్వదినాల్లో మాత్రమే కాదు .. అనునిత్యం ఆదిదేవుడికి పూజాభిషేకాలు నిర్వహించే భక్తులు ఎంతోమంది వున్నారు. సదాశివుడిని సేవించేవారు రుద్రాక్ష ధారణ చేసినట్టయితే, ఆ పూజ వలన పరిపూర్ణమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. రుద్రాక్షను ధరించడమనేది పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఒక్కో రకమైన రుద్రాక్షను ధరించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుంది.

అందువలన మనోభీష్టాన్నిబట్టి, ఆయా రుద్రాక్షలను ఎంచుకుని తగిన మంత్రాన్ని పఠిస్తూ ఆ రుద్రాక్షను ధరిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం .. ఆయుష్షు .. ఐశ్వర్యం .. విజయం .. ఇలా వివిధరకాల కోరికలను నెరవేర్చేవిగా రుద్రాక్షలు చెప్పబడుతున్నాయి. ఇక మనసులో వున్నది ఏ కోరిక అయినా అది నెరవేర్చేదిగా 'ద్విముఖి' రుద్రాక్ష స్పష్టం చేయబడుతోంది.

రెండు ముఖాలను కలిగిన ఈ రుద్రాక్ష పాలకుడు 'చంద్రుడు' కాబట్టి, దీనిని సోమవారం రోజున ధరించడం మరింత మంచిదని చెబుతారు. ఈ రుద్రాక్షను ధరించడం వలన మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చెడు అలవాట్లను ... చెడు ఆలోచనలను ఈ రుద్రాక్ష దగ్గరికి రానీయదు. ఆపదల బారిన పడకుండా కాపాడుతూ వుంటుంది.

ఇక మనసులోని కోరిక ఏదైనా అది ఈ రుద్రాక్ష ప్రభావం వలన నెరవేరుతుంది. ఇక ఏ రుద్రాక్ష అయినా దానిని ధరించినవారు పవిత్రతను పాఠిస్తూ నియమనిష్టలతో వ్యవరించినప్పుడు మాత్రమే అది ఆశించిన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు.


More Bhakti Articles
కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
1 year ago
వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం
1 year ago
అప్సరసలు .. పేర్లు
1 year ago
మోహనపురంగా పిలవబడే తిరుమోగూర్
1 year ago
వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ
1 year ago
కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే
1 year ago
మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం
1 year ago
దొంగలపై విషాన్ని వెదజల్లిన ఆదిశేషుడు
1 year ago
నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం
1 year ago
ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే
1 year ago
ద్వార లక్ష్మీ పూజా ఫలితం
1 year ago
చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు
1 year ago
పూరి క్షేత్రం ప్రత్యేకతలు
1 year ago
వ్యాధులను నివారించే విమలాదిత్యుడు
1 year ago
దైవానికి ఇలా నమస్కరించాలి
1 year ago
..more