/

ఆదిత్య హృదయం చదివితే చాలు

07-06-2014 Sat 16:53

సూర్యభగవానుడిని ప్రత్యక్ష నారాయణుడిగా భావిస్తూ పూజించడమనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది. దేవుడు ఒక్కడే అయితే, తమకి వెలుగును ... ఆహారాన్ని ప్రత్యక్షంగా అందించే సూర్యుడే ఆ ఒక్కడని వాళ్లు విశ్వసిస్తూ వచ్చారు. సమస్త జీవులకు ఆహారాన్ని అందించే ప్రకృతి ... సూర్యుడిపై ఆధారపడి వుంటుంది. అందువలన జీవులన్నీ కూడా సూర్యుడిని ఆధారంగా చేసుకునే తమ జీవనాన్ని కొనసాగిస్తూ వుంటాయి.

సమస్త ప్రాణకోటి సూర్యోదయంతోనే చైతన్యాన్ని పొందుతుంది ... సూర్యాస్తమయంతో వాటిలోని ఆ చైతన్యం క్షీణిస్తుంది. దీనిని బట్టి సూర్యుడితో జీవరాశికి గల సంబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న సూర్యుడికి నమస్కరించడం వలన, 'ఆదిత్య హృదయం' చదవడం వలన అనేక పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

సూర్యభగవానుడిని ఉపాసించే విధి విధానాలను ఆవిష్కరించేదే 'ఆదిత్య హృదయం'. సాధారణంగా పూజలు ... పారాయణాలు తమ మనసులోని కోరికలు నెరవేరాలనే ఉద్దేశంతో చేయబడుతుంటాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ఆర్ధికపరమైన ఇబ్బందుల నుంచి, మరికొంత మంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి వివిధ భక్తి మార్గాలను అనుసరిస్తూ వుంటారు. ఇక వివాహ యోగం కోసం ... సంతాన యోగం కోసం ఆరాటపడేవాళ్లు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కువగానే కనిపిస్తుంటారు.

ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం 'ఆదిత్య హృదయం' అని చెప్పవచ్చు. ఆదిత్య హృదయం చదవడం వలన ఈ కోరికలన్నీ ఫలిస్తాయి. ఇక రావణుడిపై శ్రీరామచంద్రుడు విజయం సాధించడానికి కారణం కూడా ఆదిత్య హృదయమనే చెప్పబడుతోంది. ఆదిత్య హృదయం చదవడం వలన సిరిసంపదలు, వివాహ .. సంతాన యోగాలు కలగడమే కాదు, శత్రువులు నశించి విజయాలు సొంతమవుతాయని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti Articles
కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
2 years ago
వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం
2 years ago
అప్సరసలు .. పేర్లు
2 years ago
మోహనపురంగా పిలవబడే తిరుమోగూర్
2 years ago
వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ
2 years ago
కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే
2 years ago
మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం
2 years ago
దొంగలపై విషాన్ని వెదజల్లిన ఆదిశేషుడు
2 years ago
నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం
2 years ago
ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే
2 years ago
ద్వార లక్ష్మీ పూజా ఫలితం
2 years ago
చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు
2 years ago
పూరి క్షేత్రం ప్రత్యేకతలు
2 years ago
వ్యాధులను నివారించే విమలాదిత్యుడు
2 years ago
దైవానికి ఇలా నమస్కరించాలి
2 years ago
..more