కుజదోషం గలవారు ధరించవలసిన రుద్రాక్ష

16-04-2014 Wed 18:43

భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో రుద్రాక్షలు ప్రధానమైన పాత్రను పోషిస్తూ వస్తున్నాయి. రుద్రుడి కన్నీటి బిందువులే రుద్రాక్షలుగా ఆవిర్భవించాయని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి రుద్రాక్షలను ధరించడం వలన పుణ్య క్షేత్రాల్లో స్నానాలు ... యజ్ఞయాగాదులు ... దానధర్మాలు చేసిన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది. రుద్రాక్షలో ఒక నిలువు గీత నుంచి మరో నిలువు గీత వరకూ గల భాగాన్ని ఒక ముఖంగా చెబుతుంటారు.

ఇలా ఒకే రుద్రాక్షలో ఒకటి నుంచి 21 ముఖాలు గలవి ... 32 ముఖాలు గలవి కూడా వుంటాయి. కానీ అవి మరింతగా అరుదుగా లభిస్తూ వుంటాయి. ఒకటి నుంచి 14 ముఖాల వరకూ గలవి మాత్రమే ఎక్కువగా లభిస్తూ వుంటాయి. ఇక వీటిలోనూ కొన్ని అరుదుగా మాత్రమే దొరికేవి లేకపోలేదు. ఒక్కో రుద్రాక్ష ఒక్కో ప్రత్యేకతను ... విశిష్టతను కలిగి వుంటుంది. వివిధ దోషాలతో బాధపడేవాళ్లు ఆ దోషాలను నివారించే రుద్రాక్షలను గురించి తెలుసుకుని ఆయా రుద్రాక్షలను ధరిస్తూ వుంటారు. వాటి కారణంగా మంచి ఫలితాన్ని పొందుతుంటారు.

ఈ నేపథ్యంలో కుజదోషం విషయంలో సాయపడే రుద్రాక్షను గురించి కూడా తెలుసుకోవలసి వుంటుంది. జీవితంలో వివాహమనేది ఒక ప్రధానమైన ఘట్టానికి తెరతీస్తుంది. అలాంటి వివాహానికి 'కుజదోషం' అడ్డుపడుతూ వుంటుంది. దాంతో ఇటు యువకులు ... అటు యువతులు వివాహం విషయంలో ఆలస్యమై మానసిక ఆందోళనకి లోనవుతుంటారు. ఇలా కుజదోషం కారణంగా ఇబ్బంది పడేవాళ్లు 'త్రిముఖ రుద్రాక్ష'ను ధరించవలసి వుంటుంది.

త్రిమూర్తులకు ప్రతీకగా కనిపించే ఈ రుద్రాక్ష కుజగ్రహంతో సంబంధాన్ని కలిగి వుంటుంది. అందువలన ఇది ధరించిన వారిపై కుజ గ్రహ ప్రభావం తక్కువగా వుంటుంది. ఈ రుద్రాక్ష ధరించడానికి ముందు ఆవుపాలతో శుద్ధి చేయాలి. ఆ తరువాత దానికి రుద్రాభిషేకం చేయించి సోమవారం రోజున ధరించాలి. ఈ రుద్రాక్షను ధరించి అపవిత్రమైన ప్రదేశాలకు ... మైల ప్రదేశాలకు వెళ్లకూడదు. ఈ విధమైన నియమ నిష్ఠలను పాటించడం వలన కుజుడి అనుగ్రహాన్ని సంపాదించుకోవచ్చు. ఫలితంగా కుజదోషం నుంచి బయటపడి ఆశించిన ప్రయోజనాన్ని పొందవచ్చు.


More Bhakti Articles
కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
2 years ago
వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం
2 years ago
అప్సరసలు .. పేర్లు
2 years ago
మోహనపురంగా పిలవబడే తిరుమోగూర్
2 years ago
వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ
2 years ago
కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే
2 years ago
మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం
2 years ago
దొంగలపై విషాన్ని వెదజల్లిన ఆదిశేషుడు
2 years ago
నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం
2 years ago
ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే
2 years ago
ద్వార లక్ష్మీ పూజా ఫలితం
2 years ago
చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు
2 years ago
పూరి క్షేత్రం ప్రత్యేకతలు
2 years ago
వ్యాధులను నివారించే విమలాదిత్యుడు
2 years ago
దైవానికి ఇలా నమస్కరించాలి
2 years ago
..more