సదాచారమే సకల శుభాలను కలిగిస్తుందా ?

03-04-2014 Thu 20:07

దేవుడి నుంచి అనుగ్రహాన్ని ... ప్రకృతి నుంచి ఆరోగ్యాన్ని ... తోటివారి నుంచి సహకారాన్ని స్వీకరిస్తూ మానవ జీవితం కొనసాగుతుంటుంది. మానవుల జీవితం సంతోషంగా ... సంతృప్తికరంగా కొనసాగడంలో కుటుంబ వ్యవస్థ ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. కుటుంబ వ్యవస్థ సజావుగా సాగడానికి కొన్ని పద్ధతులను ... కట్టుబాట్లను ఆచారాల పేరుతో పూర్వీకులు ప్రవేశపెట్టారు.

అందరూ ఆచరించదగినదే ఆచారం ... అయితే అందరూ వాటిని ఆచరించాలంటే అందుకు ఆధ్యాత్మిక పరమైన భావాలు బలపడాలని పూర్వీకులు భావించారు. ఆధ్యాత్మికపరమైన భావాలే మానవుడిని ధర్మబద్ధమైన మార్గంలో నడిపిస్తాయి. ధర్మాన్ని ఆచరించే వాళ్లు సంప్రదాయాలను గౌరవిస్తారు. సంప్రదాయాలు సదాచారంగా మారినప్పుడు మానవుల జీవితం నీతి బద్ధంగా .. నియమబద్ధంగా ... సమైక్యంగా కొనసాగుతుంది.

సత్యం ... న్యాయం ... దానం ... ధర్మం ... పెద్దలను గౌరవించడం ... దైవాన్ని ఆరాధించడం ఇవన్నీ సదాచారంలో భాగంగానే కనిపిస్తుంటాయి. వీటిని ఆచరించినవారి జీవితం సంతోషమయమవుతుంది ... ఆచరించనివారి జీవితం దుఃఖమయమవుతుంది. సదాచారం నుంచి దూరమైన వ్యక్తి తన జీవితంపై తానే నియంత్రణ కోల్పోతాడు. తాత్కాలికమైన ఆనందాన్నిచ్చే ఆశలవెంట పరుగులుతీస్తాడు.

ఆచారాలను గౌరవించని వారు ఎవరినుంచి గౌరవాన్ని ... సహకారాన్ని పొందలేరు. ఫలితంగా నిరాశకులోనై ఆ బాధనుంచి బయటపడటానికి వ్యసనాలకు బానిసలు అవుతుంటారు. అలా ఆకాశాన్ని అందుకోవడానికి చేసే ప్రయత్నంలో అగాధంలోకి జారిపోతుంటారు. ఇందుకు ఉదాహరణగా ఎంతోమంది రాజుల జీవితాలు చరిత్రలో కనిపిస్తుంటాయి. సదాచారమనే సన్మార్గంలో ప్రయాణించడం కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కున్నవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఆ దారి తప్పి దారిద్ర్యాన్ని ... దుఃఖాన్ని పొందినవాళ్లు ఉన్నారు.

అందువల్లనే సన్మార్గంలో నడిపించే సదాచారాలను పాటించాలని అంపశయ్యపై నున్న భీష్ముడు, తనని చూడటానికి వచ్చిన ధర్మరాజుతో చెబుతాడు. సదాచారమే ప్రశాంతత ... పవిత్రత ప్రసాదిస్తుందనీ, అలాంటి సదాచారాన్ని పాటించడం వలన సకలశుభాలు చేకూరతాయని అంటాడు. సదాచారం వ్యక్తులకు రక్షణ కవచంగా ఉంటుందనీ, భగవంతుడి అనుగ్రహాన్ని కూడా అది సాధించి పెడుతుందని స్పష్టం చేస్తాడు.


More Bhakti Articles
కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
6 months ago
వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం
6 months ago
అప్సరసలు .. పేర్లు
6 months ago
మోహనపురంగా పిలవబడే తిరుమోగూర్
6 months ago
వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ
6 months ago
కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే
6 months ago
మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం
6 months ago
దొంగలపై విషాన్ని వెదజల్లిన ఆదిశేషుడు
6 months ago
నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం
6 months ago
ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే
6 months ago
ద్వార లక్ష్మీ పూజా ఫలితం
6 months ago
చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు
6 months ago
పూరి క్షేత్రం ప్రత్యేకతలు
6 months ago
వ్యాధులను నివారించే విమలాదిత్యుడు
6 months ago
దైవానికి ఇలా నమస్కరించాలి
6 months ago
..more