పుత్రగణపతి వ్రత ఫలితం

04-03-2014 Tue 10:22

పూర్వం మహారాజులు ... చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్లంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తరువాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్లు భావించేవాళ్లు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్లు పుత్ర సంతానం కోసం ఆరాటపడే వాళ్లు. ఇందుకోసం వాళ్లు 'ఫాల్గుణ శుద్ధ చవితి' రోజున 'పుత్ర గణపతి' వ్రతాన్ని ఆచరించే వాళ్లు.

అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు ప్రస్తావిస్తున్నాయి.

ఇక రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయినా ... రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయినా 'పుత్రగణపతి వ్రతం' మాత్రం నాటి నుంచి నేటి వరకూ ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి, పరిశుభ్రమైన పట్టువస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో కలశస్థాపన చేసి ... శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్రగణపతి వ్రత కథను చదువుకుని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.

ఇంచుమించు వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఉపవాస దీక్షను చేపట్టకుండా భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తమకి పుత్ర సంతానం కావాలని పూజా సమయంలోనే స్వామివారికి దంపతులు అంకితభావంతో చెప్పుకోవాలి. బుద్ధిమంతుడు ... జ్ఞానవంతుడు ... ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి. ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతికాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతారు. అయితే ఒకసారి వ్రతం చేసి స్వామివారికి చెప్పాంగదా అని ఊరుకోకూడదు.

ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ఉండాలి. మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకితభావంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతికాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti Articles
కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
2 years ago
వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం
2 years ago
అప్సరసలు .. పేర్లు
2 years ago
మోహనపురంగా పిలవబడే తిరుమోగూర్
2 years ago
వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ
2 years ago
కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే
2 years ago
మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం
2 years ago
దొంగలపై విషాన్ని వెదజల్లిన ఆదిశేషుడు
2 years ago
నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం
2 years ago
ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే
2 years ago
ద్వార లక్ష్మీ పూజా ఫలితం
2 years ago
చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు
2 years ago
పూరి క్షేత్రం ప్రత్యేకతలు
2 years ago
వ్యాధులను నివారించే విమలాదిత్యుడు
2 years ago
దైవానికి ఇలా నమస్కరించాలి
2 years ago
..more