అన్నప్రససాదమే అక్కడ లభించే అమృతం !

19-02-2014 Wed 20:33

భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానాన్ని తమదైన శైలిలో ప్రభావితం చేసిన ఆధ్యాత్మిక గురువులలో 'కాశినాయన'కు ప్రత్యేకమైన స్థానం ఉంది. మానవసేవయే మాధవసేవగా విశ్వసించి, మాధవుడిని సేవించడానికి వచ్చిన భక్తుల ఆకలి తీరుస్తూ తరించిన మహనీయుడు కాశినాయన. ఆకలితో ఉన్నవారికి .. అందుబాటులో లేనివారికి అన్నం విలువ తెలుస్తుంది. అలాంటి ప్రదేశంలో ... అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లబడే క్షేత్రంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని కాశినాయన నిర్ణయించుకున్నాడు.

ఆయన ఆలోచనలకు తగిన ప్రదేశంగా నల్లమల అడవులలోని 'జ్యోతి నరసింహస్వామి క్షేత్రం' కనిపించింది. కడప - కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో ఆవిర్భవించిన ఈ స్వామిని దర్శించడానికి వచ్చే భక్తుల ఆకలి తీర్చడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు. అన్నపూర్ణాదేవి ఆశీస్సులతోనే ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా చెబుతారు. బలమైన ఆయన సంకల్పం కారణంగానే ఆ రోజున చిన్నపాటి ఆశ్రమంలో ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం, నేడు భారీ నిర్మాణంగా కనిపించే భవనంలో కొనసాగుతోంది.

ఆనాటి నుంచి ఇక్కడి అన్నదానం రోజంతా కొనసాగుతూనే ఉండటం విశేషం. ప్రశాంతమైన వాతావరణంలో ... ప్రకృతి ఒడిలో జరుగుతోన్న ఈ అన్నదాన కార్యక్రమం ... వనభోజనాలను తలపిస్తుంది. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించకుండా తిరిగివెళ్లరు. ఇక్కడి నరసింహుడు ఆవేదనను తీరుస్తాడనీ ... కాశినాయన ఆకలి తీరుస్తాడని చెప్పుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కాశినాయన సమాధి చెందిన ప్రదేశాన్ని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు.

ఇదే ప్రాంగణంలో కొలువైన సీతారాములను ... రాధాకృష్ణులను ... శివపార్వతులను భక్తులు పూజిస్తారు. కాశినాయని ఆశయానికి అనుగుణంగా సాగుతోన్న ఈ అన్నదానానికి భక్తులు భారీగా సహాయ సహకారాలను అందిస్తుంటారు. నరసింహస్వామి అనుగ్రహాన్ని ... కాశి నాయన ఆశీస్సులను పొందుతుంటారు.


More Bhakti Articles
కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
11 months ago
వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం
11 months ago
అప్సరసలు .. పేర్లు
11 months ago
మోహనపురంగా పిలవబడే తిరుమోగూర్
11 months ago
వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ
11 months ago
కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే
11 months ago
మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం
11 months ago
దొంగలపై విషాన్ని వెదజల్లిన ఆదిశేషుడు
11 months ago
నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం
11 months ago
ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే
11 months ago
ద్వార లక్ష్మీ పూజా ఫలితం
11 months ago
చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు
11 months ago
పూరి క్షేత్రం ప్రత్యేకతలు
11 months ago
వ్యాధులను నివారించే విమలాదిత్యుడు
11 months ago
దైవానికి ఇలా నమస్కరించాలి
11 months ago
..more