ఫన్ బకెట్ భార్గవ వ్యవహారంలో తన పేరు, ఫొటోలు వాడడంపై 'ఓఎంజీ నిత్య' స్పందన

20-04-2021 Tue 21:19
advertisement

పద్నాలుగేళ్ల మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడన్న ఆరోపణలపై టిక్ టాక్ స్టార్ ఫన్ బకెట్ భార్గవను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే, ఫన్ బకెట్ భార్గవపై వార్తలు ప్రసారం చేసే క్రమంలో చానళ్లు, వెబ్ సైట్లు తన పేరును, ఫొటోలను వాడుతున్నాయని మరో టిక్ టాక్ స్టార్ 'ఓ మైగాడ్ నిత్య' వాపోయింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది.

భార్గవ చేతిలో మోసపోయిన అమ్మాయిని తానే అని ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని పేర్కొంది. తన ఫొటోలను డిలీట్ చేయాలని కోరింది. భార్గవను కలిసి ఏడాది అయిందని, తాము హైదరాబాదుకు వచ్చేశామని నిత్య తెలిపింది. త్వరలోనే ఈ కేసులో నిజానిజాలు తెలుస్తాయని, తన ఫొటోలను కావాలని వాడుతున్నారని చెప్పలేనని, కానీ వాస్తవాలు తెలిసిన తర్వాతైనా తన ఫొటోలు తొలగించాలని విజ్ఞప్తి చేసింది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement