మిచెల్లీ ఒబామాతో నా స్నేహాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవడం దిగ్భ్రాంతిని కలిగించింది: జార్జ్ బుష్

20-04-2021 Tue 20:04
advertisement

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ తన సొంత ప్రజల ప్రవర్తన పట్ల దిగ్భ్రాంతికి గురయ్యారు. అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్లీ ఒబామాతో తన స్నేహాన్ని అమెరికా ప్రజలు అర్ధం చేసుకున్న తీరు తనను నిర్ఘాంతపరిచిందని అన్నారు.

మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అర్ధాంగి మిచెల్లీతో జార్జి డబ్ల్యూ బుష్ కు ఎంతోకాలం నుంచి స్నేహం ఉంది. పలు సందర్భాల్లో వీరిద్దరూ బహిరంగంగా దర్శనమిచ్చారు. స్మిత్సోనియన్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్ హిస్టరీ అండ్ కల్చర్ ప్రారంభోత్సవంలోనూ, 2018లో సెనేటర్ జాన్ మెక్ కెయిన్స్ అంత్యక్రియల్లోనూ వీరు జంటగా కనిపించారు.

అయితే, తమ మధ్య ఉన్న అనుబంధంపై ప్రజలు మరో రకంగా భావిస్తుండడాన్ని బుష్ జీర్ణించుకోలేకపోతున్నారు. సీబీఎస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "నేను, మిచెల్లీ ఒబామా మిత్రులుగా ఉండడం అమెరికా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందనుకుంటా. ఇంత ఏకపక్షంగా ఆలోచిస్తున్న అమెరికన్లు జార్జి డబ్ల్యూ బుష్, మిచెల్లీ ఒబామా స్నేహంగా ఉండడాన్ని ఏమాత్రం ఊహించలేకపోతున్నారు" అని వ్యాఖ్యానించారు.

అటు, బుష్ అర్ధాంగి లారా కూడా ఈ అంశంపై స్పందించారు. తన భర్తకు మిచెల్లీ ఒబామాకు మధ్య ఉన్నది కేవలం స్నేహమేనని స్పష్టం చేశారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement