ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో కరోనా కలకలం... అర్ధాంగి సునీతకు పాజిటివ్

20-04-2021 Tue 15:59
advertisement

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. నిత్యం పాతికవేల వరకు పాజిటివ్ కేసులు వస్తున్న ఢిల్లీలో  వైరస్ మహమ్మారి శరవేగంగా పాకిపోతోంది. తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనూ కరోనా కలకలం రేగింది. కేజ్రీవాల్ అర్ధాంగి సునీతకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. భార్యకు కరోనా సోకడంతో కేజ్రీవాల్ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇంటి నుంచే కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు.

అటు, కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడంతో ఢిల్లీలో బెడ్లు దొరకడంలేదని రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం అదనపు బెడ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఢిల్లీలో నేటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. కొవిడ్ ను ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సహకరించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement