రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్

20-04-2021 Tue 15:45
advertisement

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని... టెస్టుల్లో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ఇటీవల తనకు కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని, సురక్షితంగా ఉండాలని కోరారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తీవ్ర జ్వరం వచ్చిన నేపథ్యంలో ఆయనను నిన్న ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షల్లో 88 ఏళ్ల మన్మోహన్ కు పాజిటివ్ అని తేలింది. మన్మోహన్ ఇప్పటికే రెండు కరోనా డోసులు వేయించుకున్నారు. మన్మోహన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారిలో రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మీ మార్గనిర్దేశం దేశానికి చాలా అవసరమని రాహుల్ అన్నారు. మరోవైపు, మన్మోహన్ ఆరోగ్యం నిలకడగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని అందరం కోరుకుందామని చెప్పారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement