అనిల్ రావిపూడికి రామ్ గ్రీన్ సిగ్నల్!

19-04-2021 Mon 12:26
advertisement

రామ్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రెడ్' అంతగా ఆకట్టుకోలేదు. దాంతో ఆ తరువాత కథ విషయంలో ఆయన మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా కృతి శెట్టి పేరు వినిపిస్తోంది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో సాగే ఈ సినిమాలో రామ్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టును కూడా రామ్ లైన్లో పెట్టేశాడని అంటున్నారు. ఆ సినిమాకి దర్శకుడు అనిల్ రావిపూడి.


గతంలో అనిల్ రావిపూడి .. రామ్ తో 'రాజా ది గ్రేట్' చేయాలనుకున్నాడు. కొన్ని కారణాల వలన కుదరకపోవడంతో రవితేజతో తెరకెక్కించాడు. ఆ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధిచింది. అప్పటి నుంచి అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయాలని రామ్ ఉత్సాహాన్ని చూపుతున్నాడు. రీసెంట్ గా ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ ప్రాజెక్టు సెట్ అయిందని అంటున్నారు. కథాచర్చలు కూడా పూర్తయ్యాయని చెబుతున్నారు. 'ఎఫ్ 3' తరువాత అనిల్ రావిపూడి చేసే సినిమా రామ్ తోనే అని అంటున్నారు. ఇది కూడా నాన్ స్టాప్ ఎంటర్టైనర్ అనే టాక్ వినిపిస్తోంది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement