చిరూకి కథ చెప్పిన 'మహర్షి' డైరెక్టర్!

19-04-2021 Mon 11:14
advertisement

వంశీ పైడిపల్లికి ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. చాలా తక్కువ మాట్లాడతాడు .. ఎక్కువ పని చేస్తాడు అని ఆయన గురించి అంతా చెప్పుకుంటారు. అలాగే తన సినిమా ఎంత పెద్ద హిట్ అయినా ఆయన పెద్దగా హడావిడి చేయడు. అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం అసలే చేయడు. ఆయన హీరోలకు కథలు వినిపించడం .. వాళ్లు ఓకే చేయడం .. షూటింగు మొదలైపోవడం ఇవన్నీ కూడా సైలెంట్ గా జరిగిపోతుంటాయి. అలాంటి వంశీ పైడిపల్లి 'మహర్షి' సినిమా తరువాత అనుకున్నంత త్వరగా మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోతున్నాడు.

ఎన్టీఆర్ .. చరణ్ .. మాహేశ్ బాబు వంటి యంగ్ స్టార్ హీరోలకు భారీ విజయాలను అందించిన వంశీ పైడిపల్లి, నాగార్జున వంటి సీనియర్ స్టార్ హీరోకు కూడా ఘన విజయాన్ని అందించాడు. అలాంటి ఆయన రీసెంట్ గా చిరంజీవిని కలిసి ఒక కథను వినిపించినట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా ఈ కథపైనే కసరత్తు చేస్తూ వచ్చిన వంశీ పైడిపల్లి, కథ బాగా వచ్చిందన్న నమ్మకం కుదిరిన తరువాతనే చిరంజీవికి చెప్పాడట. చిరంజీవి నుంచి సమాధానం రావలసి ఉందని అంటున్నారు. ఒకవేళ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి చాలా సమయమే పట్టనుంది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement