'పుష్ప' యాక్షన్ సీన్స్ కోసం 39 కోట్ల ఖర్చు?

19-04-2021 Mon 10:45
advertisement

అల్లు అర్జున్ తన సినిమాలకి సంబంధించిన కథల విషయంలో ఎంతటి శ్రద్ధ తీసుకుంటాడో, డాన్సులు .. ఫైట్ల విషయంలోను అంతే దృష్టి పెడతాడు. తన సినిమా నుంచి ఆడియన్స్ ఏం ఆశిస్తారనే విషయంలో ఆయనకు పూర్తి క్లారిటీ ఉంటుంది. అందువల్లనే అన్నీ అనుకున్న విధంగా సెట్ అయిన తరువాతనే ఆయన సెట్స్ పైకి వెళతాడు. ఆయన తాజా చిత్రంగా 'పుష్ప' రూపొందుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా .. ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. పెర్ఫెక్ట్ ప్లానింగుతో ఆయన ఈ సినిమా షూటింగును కానిస్తున్నాడు.

ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన వీడియోను బట్టి, ఒక రేంజ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయనే విషయం అందరికీ అర్థమైపోయింది. పీటర్ హెయిన్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కోసం మాత్రమే 39 కోట్ల రూపాయలను కేటాయించారని చెప్పుకుంటున్నారు. దీనిని బట్టి ఈ సినిమాలో ఎంతటి భారీ ఫైట్లు .. రిస్కీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. బన్నీ 'తగ్గేదే లే' అనే ఊతపదం ఇప్పటికే పాప్యులర్ అయిపోయింది. ఊర్వశీ రౌతేలా ఐటమ్ కుర్రాళ్లను ఒక ఊపు ఊపేస్తుందని అంటున్నారు. ఆగస్టు 13న ఈ సినిమా విడుదల కానుంది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement