మహేశ్ తో త్రివిక్రమ్ చేస్తున్నది ఎన్టీఆర్ కి చెప్పిన కథేనా?

19-04-2021 Mon 10:16
advertisement

త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. త్వరలో వీరిద్దరూ కలిసి సెట్స్ పైకి వెళతారని అభిమానులు అనుకున్నారు. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ సిద్ధం చేసిన ఈ కథ రాజకీయాల నేపథ్యంలో సాగుతుందని చెప్పారు. సమకాలీన రాజకీయాల ప్రస్తావన ఈ సినిమాలో ఉంటుందని అన్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ ను రంగంలోకి దించనున్నట్టు వార్తలు వచ్చాయి. రాజకీయాలకు సంబంధించిన కథ కావడం వల్లనే ఈ సినిమాకి 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను సెట్ చేశారు.

అయితే ఒక్కసారిగా సీన్ మారిపోయింది .. ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను కొరటాలతో చేయనున్నట్టుగా ఒక వార్త బయటికి వచ్చింది. ఇక త్రివిక్రమ్ తాజా సినిమా మహేశ్ బాబుతో ఉండనుందనే టాక్ వినిపించింది. ఏం జరిగి ఉంటుందనేది ఎవరికీ తెలియదు. ఊహాగానాలు మాత్రం తమ ప్రతాపం చూపుతున్నాయి.

ఇక మహేశ్ తో జూన్ లో సెట్స్ పైకి వెళ్లి .. అక్టోబర్ నాటికి షూటింగు పూర్తిచేయాలనే ప్లానింగ్ తో త్రివిక్రమ్ ఉన్నాడని అంటున్నారు. ఈ కథ కూడా రాజకీయాల నేపథ్యంలోనే నడుస్తుందనీ, సంజయ్ దత్ రాజకీయనాయకుడిగా కనిపించనున్నాడని అంటున్నారు. దాంతో ఇది ఎన్టీఆర్ కి వినిపించిన కథేనా? అనే సందేహం అభిమానుల్లో కలుగుతోంది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement