కరోనాతో బీహార్ మాజీ మంత్రి మేవాలాల్ చౌదరి కన్నుమూత

19-04-2021 Mon 09:22
advertisement

కరోనా మహమ్మారి బారినపడి మరణిస్తున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా బీహార్ మాజీ మంత్రి, జేడీయూ ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరి కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గతవారం కరోనా బారినపడిన ఆయన పాట్నాలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.

కాగా, తారాపూర్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన మేవాలాల్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడంతో మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. మేవాలాల్ మృతికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి విద్య, రాజకీయ రంగాలకు తీరని లోటని పేర్కొన్నారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement