సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

19-04-2021 Mon 07:35
advertisement

*  బాలీవుడ్ నటి అలియా భట్ కథానాయికగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న 'గంగూభాయ్ కతియావాడి' చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసే యోచన చేస్తున్నారట. వాస్తవానికి జులై 30న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని భావించారు. అయితే, కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో నిర్మాతలు ఓటీటీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.
*  బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న 'అఖండ' చిత్రం డిజిటల్  హక్కులను తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ రేటుకి సొంతం చేసుకుంది. అలాగే శాటిలైట్ హక్కులను స్టార్ మా ఫ్యాన్సీ రేటుకి పొందినట్టు తెలుస్తోంది. ఉగాదికి విడుదలైన ఈ చిత్రం టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
*  ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' చిత్రంలో నటిస్తున్న అఖిల్ అక్కినేని తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తాడు. ఇదిలావుంచితే, పూజ హెగ్డేతో కలసి అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్' సినిమా ఈ వేసవిలో విడుదలవుతోంది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement