ప్రజల తీరు ఆశ్చర్యంగా ఉంది.. కొవిడ్ కట్టడికి మిలటరీ అవసరం: ఝార్ఖండ్ సీఎం 

19-04-2021 Mon 07:24
advertisement

ప్రాణాంతక వైరస్ కల్లోలం సృష్టిస్తున్నప్పటికీ ప్రజల్లో లేశమాత్రమైనా భయం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, దీనిని అదుపు చేసేందుకు మిలటరీ బలగాలు అవసరమని అన్నారు. మిలటరీని పంపాలని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు లేఖలు రాయనున్నట్టు చెప్పారు.

ఉప ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ప్రజలను చూసి తాను షాకయ్యానని సోరెన్ తెలిపారు. మాస్కులు పెట్టుకోకుండా, భౌతికదూరం పాటించకుండానే ప్రజలు తిరుగుతున్నారని, వాళ్లకు కరోనా అంటే అస్సలు భయం లేదని అన్నారు. ఇలాంటి వారందరికీ సమాధానం ఇచ్చేందుకు కేంద్రానికి లేఖ రాయబోతున్నట్టు చెప్పారు. కాగా, ఝార్ఖండ్‌లో ఇప్పటి వరకు 1.6 లక్షల మంది కరోనా బారినపడగా 1,341 మంది మృతి చెందారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement