రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఆంక్షలు.. రోజుకు రూ.300 కోట్లకుపైగా నష్టం

19-04-2021 Mon 06:48
advertisement

కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న ఆంక్షల కారణంగా దేశ వ్యాప్తంగా రవాణా రంగం రోజుకు రూ. 315 కోట్ల మేర నష్టపోతున్నట్టు మోటార్ ట్రాన్స్‌పోర్టు సంఘాలు చెబుతున్నాయి. ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న ఆంక్షల కారణంగా ట్రక్కులకు 50 శాతం డిమాండ్ తగ్గిపోయిందని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) కోర్ కమిటీ చైర్మన్ బాల్‌మల్కిత్ సింగ్ తెలిపారు.

రాష్ట్రాలు అత్యవసర సేవలు, రవాణాకు మాత్రమే అనుమతినిస్తున్నాయని, దీంతో ఆహార వస్తువులు, ధాన్యం, వైద్య ఉపకరణాలు మాత్రమే సరఫరా అవుతున్నట్టు చెప్పారు. ఆటోమోటివ్ హబ్ అయిన మహారాష్ట్రకు రవాణా పూర్తిగా నిలిచిపోయిందన్నారు. ఆంక్షల నేపథ్యంలో ట్రక్కు డ్రైవర్లు మరోమారు ఇబ్బందుల్లో కూరుకుపోయారని, కాబట్టి గతంలో ఇచ్చినట్టుగా టోల్, రోడ్డు పన్నుల నుంచి మినహాయిపులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement