అమెరికాలో మళ్లీ కాల్పులు.. దుండగుడి చేతిలో ముగ్గురి మృత్యువాత

19-04-2021 Mon 06:35
advertisement

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. టెక్సాస్ రాజధాని ఆస్టిన్‌లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం నిన్న ఉదయం ఓ షాపింగ్ మాల్‌ సమీపంలోని అపార్ట్‌మెంట్ వద్ద ఈ ఘటన జరిగింది.

ఇది గృహ హింసకు సంబంధించినదని, ఈ ఘటన వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని పోలీసులు తెలిపారు. నిందితుడిని పోలీసులు గుర్తించారని అధికారులు తెలిపారు. చనిపోయిన వారు ముగ్గురూ పెద్ద వయసు వారేనని పేర్కొన్నారు. కాగా, కాల్పులు జరిగిన ప్రదేశంలోని ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు కోరారు.

ఇటీవల దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ వాణజ్య భవనంలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో చిన్నారి సహా నలుగురు మరణించిన సంగతి తెలిసిందే.

advertisement

More Flash News
advertisement
..more
advertisement