తిరుపతి ఉప ఎన్నికకు ముగిసిన ప్రచారం.. ఎల్లుండి పోలింగ్

15-04-2021 Thu 21:51
advertisement

తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికకు నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. ఇక, ఈ నెల 17న పోలింగ్ చేపట్టి, మే 2న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక బరిలో 28 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తిరుపతి లోక్ సభ స్థానం పరిధిలో 17 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 2,440 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఉప ఎన్నిక నేపథ్యంలో తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ సాయంత్రం నుంచి ఈ నెల 18వ తేదీ రాత్రి 7 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ఐదుగురికి మించి గుమికూడడం, గుంపులుగా తిరగడంపై నిషేధం విధించారు. లౌడ్ స్పీకర్లతో సమావేశాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement