ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్... టాస్ గెలిచిన రాజస్థాన్

15-04-2021 Thu 19:24
advertisement

ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే మైదానం వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లకు ఇది టోర్నీలో రెండో మ్యాచ్. తొలి మ్యాచ్ లో ఢిల్లీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది. దాంతో నేటి మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో రాజస్థాన్ జట్టు బరిలో దిగుతోంది.

అయితే స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గాయంతో జట్టు నుంచి తప్పుకోవడం రాజస్థాన్ రాయల్స్ కు ఎదురుదెబ్బ అని చెప్పాలి. అయినప్పటికీ కెప్టెన్ సంజూ శాంసన్, జోస్ బట్లర్, శివమ్ దూబే, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, క్రిస్ మోరిస్ వంటి హార్డ్ హిట్టర్లతో ఆ జట్టు బలంగానే ఉంది.

మరోవైపు చెన్నై వంటి బలమైన జట్టుపై గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ కు సిద్ధమైంది. యువ సారథి రిషబ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ జట్టులో ధావన్, పృథ్వీ షా రూపంలో మెరుగైన ఓపెనింగ్ జోడీ అందుబాటులో ఉంది. బంతితో పాటు బ్యాట్ తోనూ సత్తా చాటగల మార్కస్ స్టొయినిస్, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ వంటి ఆల్ రౌండర్లు ఉండడం ఢిల్లీకి అదనపు బలం.

advertisement

More Flash News
advertisement
..more
advertisement