బాలయ్య సినిమాలో వేటపాలెం గ్యాంగ్ ఫైట్?

15-04-2021 Thu 19:11
advertisement

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి 'అఖండ' సినిమాను రూపొందించాడు. బాలకృష్ణ పాత్రలోని వేరియేషన్స్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. టీజర్ లో బాలకృష్ణ లుక్ చూసిన అభిమానులు, సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో పూర్ణ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ సినిమా తరువాత బాలకృష్ణ .. గోపీచంద్ మలినేనితో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నాడు.


ఈ సినిమా కథపై కసరత్తు చేస్తున్న గోపీచంద్, ప్రకాశం జిల్లా వేటపాలెంలోని పురాతనమైన గ్రంథాలయానికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. అక్కడ వేటపాలెం గ్యాంగ్ కి సంబంధించిన వివరాల కోసం ఆయన సెర్చ్ చేశాడని అంటున్నారు. దాంతో బాలకృష్ణ సినిమాలోనూ వేటపాలెం గ్యాంగ్ ఫైట్లు ఉండనున్నట్టు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని రీసెంట్ గా 'క్రాక్' తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విజయంలో వేటపాలెం గ్యాంగ్ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ గా నిలిచింది. అందువలన ఈ సారి ఈ తరహా ఎపిసోడ్ పై ఆయన ఎక్కువ ఫోకస్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement