ఏప్రిల్‌ 2022 తర్వాత పట్టాలెక్కనున్న కొరటాల శివ, అల్లు అర్జున్ చిత్రం

13-04-2021 Tue 22:54
advertisement

ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రం 'పుష్ప'తో బిజీగా ఉన్న అల్లు అర్జున్‌ తదుపరి చిత్రాన్ని  కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్‌తో పాటు గీతా ఆర్ట్స్‌లో ఓ విభాగమైన జీఏ2 అఫీషియల్‌ కలిసి నిర్మించనున్నట్లు సమాచారం.

ఈ మేరకు ఈ చిత్రం ఏప్రిల్‌ 2022 తర్వాత పట్టాలెక్కనున్నట్లు యువసుధ ఆర్ట్స్‌ వెల్లడించింది. తనదైన స్టైల్‌తో అభిమానుల్ని ఆకట్టుకునే అల్లు అర్జున్‌, సామాజిక కోణానికి కమర్షియల్‌ హంగులు అద్ది ప్రజల్ని కట్టిపడేసే డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రాబోతోందంటే సర్వత్రా ఆసక్తి  నెలకొంది.

ఇప్పటికే విడుదలైన పుష్ప సినిమా ట్రైలర్‌లో అల్లు అర్జున్‌ పూర్తి మాస్‌ లుక్‌లో అందరినీ కట్టిపడేస్తున్న విషయం తెలిసిందే. మరి కొత్త సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా కథ రాజకీయ నేపథ్యంలో కొనసాగే అవకాశం ఉందని ఊహాగానాలు ఊపందుకున్నాయి.

advertisement

More Flash News
advertisement
..more
advertisement