ఆండ్రాయిడ్‌ అనధికార యాప్‌స్టోర్‌ ఏపీకేప్యూర్‌తో భద్రతా సమస్యలు!

13-04-2021 Tue 22:23
advertisement

ఆండ్రాయిడ్‌ అనధికార యాప్‌స్టోర్‌ ఏపీకే ప్యూర్‌ మాల్వేర్‌కు గురైనట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్‌స్కీ వెల్లడించింది. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా ప్రమాదకరమైన ట్రోజన్లు ఆండ్రాయిడ్‌ పరికరాల్లోకి చొరబడతాయని హెచ్చరించింది.

ఆండ్రాయిడ్‌ యూజర్లకు గూగుల్‌ ప్లే స్టోర్ అధికారిక యాప్‌ స్టోర్‌. దీని నుంచే ఏవైనా యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. కానీ, ఏపీకేప్యూర్‌ సైతం ఉచితంగా యాప్‌లను అందిస్తోంది. అయితే ఈ యాప్‌ అన్ని పరీక్షల్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకోలేకపోయిందని క్యాస్పర్‌స్కీ వెల్లడించింది. ఏపీకేప్యూర్‌లో 3.17.18 వెర్షన్‌లో ట్రోజన్‌తో కూడిన ఓ ఎస్‌డీకే అడ్వర్జైజ్‌మెంట్‌ ఉందని తెలిపింది.  

దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్న పరికరంలో ఈ ట్రోజన్‌ ప్రమాదకర చర్యలకు దారితీస్తోందని హెచ్చరించింది. లాక్‌స్క్రీన్‌పై యాడ్‌లు చూపించడం, బ్రౌజర్‌ ట్యాబ్‌లను ఓపెన్‌ చేయడం, పరికరానికి సంబంధించిన వివరాల్ని సేకరించడం, ఇతర మాల్వేర్లను డౌన్‌లోడ్‌ చేయడం వంటి ప్రమాదకర చర్యలకు ఇది కారణమవుతోందని తెలిపారు.

అయితే, 3.17.19 అనే కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఏపీకేప్యూర్‌ ప్రకటించింది. ఈ యాప్‌లో భద్రతకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించినట్లు డెస్క్రిప్షన్‌లో పేర్కొన్నారు. దీన్ని ఉపయోగించుకోవడం మేలని క్యాస్‌పర్‌స్కీ వెల్లడించింది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement