కుంభమేళాలో లక్షల మంది ఒక్కచోటే... హరిద్వార్ లో ప్రమాద ఘంటికలు!

13-04-2021 Tue 22:12
advertisement

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ వద్ద గత కొన్నిరోజులుగా మహాకుంభ్ పేరిట కుంభమేళా కొనసాగుతోంది. నిత్యం లక్షల మంది భక్తులు, సాధువులు ఇక్కడికి తరలివస్తున్నారు.  ఓవైపు దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లక్షల మంది ఒక్కచోటే గుమికూడుతున్న దృశ్యాలు కుంభమేళాలో దర్శనమిస్తున్నాయి.

నిన్న 'షాహీ స్నాన్' సందర్భంగా పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఘాట్ల వద్దకు పోటెత్తారు. వీరిలో చాలామందికి మాస్కులు లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. కరోనా నివారణలో భౌతిక దూరం కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్న అంశం అయినా, ఇక్కడ కరోనా మార్గదర్శకాల అమలు కష్టసాధ్యంగా మారింది. హరిద్వార్ లో రెండు రోజుల్లో 1000 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడం పరిస్థితి ఎలా ఉందో చెబుతోంది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement