'వకీల్ సాబ్'పై పుకార్లను నమ్మవద్దు: చిత్రబృందం స్పష్టీకరణ

12-04-2021 Mon 21:12
advertisement

ఏప్రిల్ 9న విడుదలైన 'వకీల్ సాబ్' చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. పవన్ కల్యాణ్ మూడేళ్ల తర్వాత నటించిన చిత్రం కావడంతో ఫ్యాన్స్ థియేటర్లకు పోటెత్తుతున్నారు. అయితే 'వకీల్ సాబ్' చిత్రం త్వరలో ఓటీటీ వేదికల్లో రిలీజ్ అవుతోందంటూ ప్రచారం జరుగుతుండడం పట్ల చిత్రబృందం స్పందించింది.

అవన్నీ పుకార్లేనని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేసింది. 'వకీల్ సాబ్' చిత్రాన్ని థియేటర్లలోనే చూడాలని పిలుపునిచ్చింది. సమీప భవిష్యత్తులో ఏ ఓటీటీ వేదికపైనా 'వకీల్ సాబ్' చిత్రాన్ని విడుదల చేసే ఉద్దేశంలేదని వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement