చంద్రబాబు వాహనంపై రాళ్లదాడికి యత్నం... వాహనం దిగి రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

12-04-2021 Mon 20:18
advertisement

తిరుపతి ఉప ఎన్నిక రాజకీయం మరింత వేడెక్కింది. తిరుపతిలో టీడీపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభపై రాళ్ల దాడి జరిగింది. కొందరు దుండగులు సభకు విచ్చేసిన వారిపై రాళ్లు విసరగా, ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ మహిళ ఉంది. దుండగులు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచార వాహనంపైనా రాళ్లు విసిరేందుకు యత్నించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు వాహనం దిగి రోడ్డుపై బైఠాయించారు.

జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న తనకే రక్షణ కల్పించలేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని మండిపడ్డారు. తన సభకు పోలీసులు సరైన భద్రత కల్పించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రౌడీయిజాన్ని సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. కాగా, చంద్రబాబు రోడ్డుపై బైఠాయించడంతో ఇతర నేతలు, కార్యకర్తలు కూడా అక్కడే ఆందోళనకు ఉపక్రమించారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement