కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ చిత్రం... రిలీజ్ డేట్ కూడా వెల్లడి

12-04-2021 Mon 19:45
advertisement

ఎన్టీఆర్ 30వ చిత్రం ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభిమానులకు ఉగాది ముందు తియ్యని కబురు అందింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త చిత్రం ఉంటుందని అధికారిక ప్రకటన వెలువడింది. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మాణం జరుపుకోనుంది. సినిమా ప్రకటించడమే కాదు, రిలీజ్ డేట్ కూడా ఒకేసారి వెల్లడించారు. 2022 ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.

గతంలో ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందని తారక్ ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.

మరోసారి ఎన్టీఆర్ తో కలిసి పనిచేస్తుండడం పట్ల దర్శకుడు కొరటాల శివ హర్షం వ్యక్తం చేశాడు. చివరిసారి తాము చేసినవి లోకల్ రిపేర్లు అనీ, ఈసారి కాస్త మార్పు కోసం సరిహద్దులు దాటుతున్నామనీ కొరటాల వెల్లడించాడు. ఎన్టీఆర్ 30వ చిత్రం దాన్ని మించి ఉంటుందని తెలిపాడు. అటు, కొరటాలతో మళ్లీ పనిచెయ్యనుండడంపై ఎన్టీఆర్ కూడా స్పందించాడు. 'మీతో మరో సినిమా చేయడం నాక్కూడా సంతోషదాయకమే' అంటూ ట్వీట్ చేశాడు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement