నవీన్ పోలిశెట్టికి పెరుగుతున్న డిమాండ్!

12-04-2021 Mon 19:20
advertisement

ఇటీవల కాలంలో ఎక్కువమంది నోళ్లలో నానిన సినిమా టైటిల్ .. 'జాతిరత్నాలు'. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించారు. విడుదలైన ప్రతిప్రాంతంలోను ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా రాబట్టిన వసూళ్లు .. సాధించిన రికార్డులు ఈ ముగ్గురిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీళ్లకి అవకాశాలు కూడా వరుసగా వస్తున్నాయట. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ఆల్రెడీ చాలా ప్రాజెక్టులలో ఉండిపోయారు.  అయినా వాళ్ల డేట్స్ కోసం చాలామంది దర్శక నిర్మాతలు వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట.

ఇక నవీన్ పోలిశెట్టి విషయానికొస్తే, హాస్యకథానాయకుడిగా ముందుకు సాగడానికే ఆయన ఎక్కువ ఆసక్తిని  చూపుతున్నాడు. తాను లీడ్ రోల్ చేసే ఆలోచనలోనే ఆయన ఉన్నాడు. అందువలన ఆ తరహా కథలను మాత్రమే వింటున్నాడట. యువ దర్శకులు చాలామంది ఆయనకి కథలు వినిపించే పనిలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. నవీన్ పోలిశెట్టి ఓకే అంటే నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారట. పారితోషికం ఎక్కువైనా ఫరవాలేదు .. తమ సినిమా చేయమని అడుగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి నవీన్ ఏ ప్రాజెక్టుకి ఓకే చెబుతాడో చూడాలి.

advertisement

More Flash News
advertisement
..more
advertisement