'బాహుబలి' నిర్మాతల నుంచి రెజీనాకు కాల్!

12-04-2021 Mon 18:40
advertisement

తెలుగు తెరకు కొత్త అందాన్ని అద్దిన కథానాయికలలో రెజీనా ఒకరు. ఆకర్షణీయమైన కళ్లతోనే అన్నిరకాల భావాలను పలికించగల నటిగా ఆమె మంచి పేరు తెచ్చుకుంది. ఇక పాత్రపరంగా గ్లామర్ ఒలకబోయడానికి ఆమె ఎంతమాత్రం సందేహించదు. అందువలన యూత్ లో ఆమెకి మంచి క్రేజ్ ఉంది. అయితే రెజీనా దురదృష్టం కొద్దీ ఆమె సినిమాలు కొన్ని అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో సహజంగానే ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇటీవల 'ఆచార్య' సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. మరి ఈ సాంగ్ ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

ఈ నేపథ్యంలోనే 'బాహుబలి' నిర్మాతల నుంచి రెజీనాకు కాల్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది సినిమా కోసం కాదు .. వెబ్ సిరీస్ కోసం. ఈ నిర్మాతలు ఓటీటీ వేదికగా ఒక వెబ్ సిరీస్ ను నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇది హారర్ నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్. ఈ తరహా పాత్రకు రెజీనా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరిపినట్టుగా చెప్పుకుంటున్నారు. కథ అంతా కూడా రెజీనా చుట్టూనే తిరుగుతుంది. అందువలన రెజీనా తప్పకుండా చేస్తుందనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

advertisement

More Flash News
advertisement
..more
advertisement