యథార్థ సంఘటన ఆధారంగా రవితేజ కొత్త సినిమా!

12-04-2021 Mon 17:48
advertisement

రవితేజ ఒక కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. దాంతో ఆ దర్శకుడు ఎవరు? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఆ దర్శకుడు పేరు శరత్ మండవ అనేది తాజా సమాచారం. ఆయన వినిపించిన ఒక కథ కొత్తగా .. వైవిధ్యభరితంగా అనిపించడంతో, వెంటనే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఆంధ్రా ప్రాంతంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందనుందట.


ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ 'ఖిలాడి' సినిమా చేస్తున్నాడు. తాజాగా వదిలిన టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా తరువాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమా కూడా పూర్తయిన తరువాత, శరత్ మండవ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో ఇద్దరు నాయికలు ఉండనున్నట్టు తెలుస్తోంది. మరి రవితేజ సరసన నాయికలుగా ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.

advertisement

More Flash News
advertisement
..more
advertisement